Home / SLIDER / రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ నీటిని దోచుకెళ్లిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. తండ్రి తరహాలోనే నీటిని దోపిడీ చేస్తున్న వైఎస్‌జగన్‌ను గజదొంగ అనక ఇంకేం అంటారో చెప్పాలని అన్నారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పీజేఆర్‌ (పీ జనార్దన్‌రెడ్డి) చావుకు కారణం వైఎస్‌ఆరేనని, నీళ్ల దోపిడీ చేసింది.. భూములు తీసుకుపోయింది ఆయనేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ఆర్‌ బతికుంటే తెలంగాణ రానియ్యకుండె.

వంద మందినైనా ఖతం చేస్తుండె కానీ రానియ్యకుండె. గుండె మీద చేయి వేసుకొని ఈ మాటలు మీ ఆంధ్రా ప్రాంత నాయకులు అంటున్నరా లేదా ఒక్కసారి అడగండి. తెలంగాణను బాగుపర్చుకుందామని సయోధ్యతో ఉందామని అంటే మీరు నోట్లో చెక్కర.. కడుపులో కత్తెర అన్నట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రవాళ్లు మాకు దుష్మన్‌ కాదు. అన్నదమ్ముల్లాగానే భావిస్తాం. కానీ మీరు కూడా ఇలాంటి అక్రమాలను ప్రశ్నించాలి’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat