బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేందర్‌గా పిలవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైందేనని, కానీ బీజేపీ ఫేక్ లేఖగా చిత్రీకరించి ప్రచారం చేస్తుందన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే ఆ లేఖ ఫేక్ అని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి, ఢిల్లీ దొరల దగ్గర మోకరిల్లాడు అని ధ్వజమెత్తారు.
ఈటల ఇక నుంచి బీజేపీ రాజేందర్‌గానే మిగిలిపోతారు అని పేర్కొన్నారు. తనకున్న 200 ఎకరాల్లో.. ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికలో ఖర్చు పెట్టి గెలుస్తానని ఈటల చెప్పారు. ఆ డబ్బు సంచులతో వచ్చే బీజేపీ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని సుమన్ సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని బాల్క సుమన్ స్పష్టం చేశారు.