తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి… ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని ఆదేశించారు.
వర్క్ చార్ట్ ప్రకారం నిర్మాణ పనులు శరవేగంగా,పూర్తి నాణ్యతతో జరగాలని అధికారులతో అన్నారు.
మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,ఎస్.ఈ లు సత్యనారాయణ,లింగారెడ్డి, ఈ.ఈ శశిధర్,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు,ఆర్కిటెక్ట్ లు ఆస్కార్ పొన్ని తదితరులు పాల్గొన్నారు..