కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వర్షపు నీటి నాలా అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు విచ్చేసి జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి నాలా ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు.
సరైన ఔట్ లెట్ వ్యవస్థ లేని కారణంగా వర్షపు నీరు నిలిచి నిత్యం సమస్య ఏర్పడుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. నాలా అభివృద్ధిలో భాగంగా అవసరమయ్యే స్థలాన్ని ఇచ్చేందుకు అక్కడి యజమానులు ఒప్పుకోవడంతో వెంటనే ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసి రవీందర్ కుమార్, ఈఈ కృష్ణ చైతన్య, డిఈ శిరీష, వార్డు మెంబర్ జానకిరామ్, టిఆర్ఎస్ నాయకులు వారాల వినోద్, మన్నె బాలేష్, రాఘవ రెడ్డి, యాదిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సురేష్, సుబ్బారావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.