ఒకేరోజు 14 పార్కులను కరీంనగర్లో ప్రారంభించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 4కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ పార్కులు నగరవాసులకు అహ్లదంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పట్టణాలు సైతం ఎలాంటి వసతులు లేక కుగ్రామాలుగా అల్లాడేవని, అస్తవ్యస్తమైన శానిటేషన్తో, ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడం జరిగేదని ఆక్షేపించారు. అధికారులు డెవలప్ చేద్దామన్నా గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించక స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివ్రుద్ది కోసం వేల కోట్ల నిదులను వెచ్చిస్తున్నారన్నారు మంత్రి గంగుల. కేసీఆర్ గారు అందిస్తున్న ప్రోత్సాహంతో నేడు అన్ని స్థానిక ప్రభుత్వాలకు దండిగా నిధులు అందడంతో శానిటేషన్, తాగునీరు, రోడ్లు వంటి మౌళిక వసతులు గణనీయంగా తెలంగాణలో అభివ్రుద్ది అయ్యాయన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాల ద్వారా గ్రామాల, నగరాల రూపురేఖలు మారడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడుతున్నాయన్నారు.
ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రభుత్వ స్థలాలను కభ్జాలకు గురిచేయకుండా అడ్డుకోవడంతో పాటు ఆ స్థలాల్లో కరీంనగర్ నగర వాసులకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే విదంగా పార్కులను రూపుదిద్దామన్నారు మంత్రి గంగుల. కొన్న చోట్ల కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలపై ప్రభుత్వ పక్షాన పోరాడుతున్నామని అతి త్వరలోనే అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు మంత్రి. అల్కాపురిలో 50 లక్షల అమృత్ నిధులతో నూతనంగా నిర్మించిన పార్కుతో పాటు నగరంలోని ఇతర పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. శరవేగంగా అభివ్రుద్ది సాధిస్తున్న నగర పాలక వర్గాన్ని, అధికారులను మంత్రి అభినందించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటి మేయర్ చల్లా స్వరూప హరిశంకర్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరు క్రాంతి, కార్పోరేటర్ ఐలందర్ యాదవ్,ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు..