తెలంగాణలో చెరువుల్ల నీళ్లు.. బావుల్ల నీళ్లు.. వాగుల్ల నీళ్లు.. కుంటల్ల నీళ్లు.. కాలువల్ల్ల నీళ్లు.. తలాపు నుంచి సిగ దాకా నలుచెరగులా గోదావరి పరవళ్లు. ఇది బంగారు తెలంగాణ సాధనకు లెజండరీ విజనరీ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలికిన నాందీవాచకం. దీనిపేరు కాళేశ్వరం. మూడే మూడేండ్ల కాలంలో జలభాండాగారంగా ఆవిర్భవించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకోబోతున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత చానల్ డిస్కవరీ.. కాళేశ్వర చరిత్రను ‘లిఫ్టింగ్ ఎ రివర్’ అన్న పేరిట డాక్యుమెంటరీ ప్రసారం చేయనున్నది. ఢిల్లీకి చెందిన పల్స్ మీడియా ప్రొడక్షన్ నేతృత్వంలో తెలంగాణకే చెందిన డైరెక్టర్ రాజేంద్ర శ్రీవాత్సవ నేతృత్వంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. చిత్రీకరణను 2017లో ప్రారంభించారు.
దశాబ్దాల ఆర్తి నుంచి అద్భుతావిష్కారం వైపు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. తెలంగాణకు మాత్రమే సాధ్యమైన అపూర్వ జలకుడ్యం. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే. ఆయనే ఇంజినీరై.. ప్రాజెక్టును తానే స్వయంగా రీ డిజైన్ చేసి.. విశ్వమే విస్తుపోయేట్లు చేసిన నిర్మాణం. ఈ కాళేశ్వరం మూలంగానే నేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా కాకతీయ కాల్వ చివరి భూముల దాకా కాళేశ్వర జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ప్రధాన నది స్రవంతిలో ఆయా ప్రాంతాల్లో ఉపనదులు వచ్చి చేరుతాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాణహిత వంటి ఉపనదులే గోదావరి ప్రధాన ప్రవాహ ప్రాంతాన్ని నింపుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎగువన చుక్క నీరు లేని గోదావరి గర్భాన్ని ఉపనదులు తమ జలధారలతో నింపి.. నదీగర్భాన్ని మహా రిజర్వాయర్‌గా మారుస్తున్నది. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలను సజీవ ధారలతో సస్యశ్యామలం చేస్తున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు
ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్‌లో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు అతి పెద్దవిగా రికార్డులు నమోదు చేయగా, వాటిని తలదన్నే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంతా రికార్డులమయంగా మారిపోయింది