తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ,మిల్కీ బ్యూటీ తమన్నా స్పీడ్ మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తుంది. తమన్నా సినిమల విషయానికి వస్తే ఈ అమ్మడు నటించిన సీటీమార్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎఫ్ 3, మాస్ట్రో చిత్ర షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఆమె నటించిన లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. ఈ రెండు వెబ్ సిరీస్‌లలో తమన్నా నటనకు ఇంప్రెస్ అయిన మేకర్స్ మరో ఆఫర్ ఇచ్చారట.
ఇది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కానుందని, అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ఈ వెబ్‌సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాలతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హోస్ట్‌గా కూడా సందడి చేసేందుకు తమన్నా సిద్ధమైంది.