ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా కానిస్టేబుళ్లకు ఇచ్చిన తరహాలోనే మహిళా పోలీసు కార్యదర్శులకు యూనిఫాం ఇవ్వబోతున్నారు.
వివిధ చట్టాల కింద ఇచ్చిన అధికారాలను మహిళా పోలీసులకు ప్రభుత్వం అప్ప చెబుతోంది. వీరు ఇక నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు బాధ్యులుగా పని చేయాల్సి ఉంటుంది.
మహిళా పోలీసు సిబ్బందికి పదోన్నతులుగా అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను కేటాయించనున్న రాష్ట్ర ప్రభుత్వం . ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్.