జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఈ మూవీ నివేదా కెరీర్ సాఫీగా సాగిపోయేలా బ్రేక్ ఇచ్చింది.
ఈ భామ ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించింది. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అందరినీ పలుకరించే నివేదా థామస్ ఈ సారి ఎవరూ ఊహించని సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరూ స్టన్ అయ్యేలా చేసింది.
ఎర్రచీరలో ఆకట్టుకునే అందంతో అందరి మతులు పోగొడుతోంది నివేదాథామస్. ఇంట్లో దిగిన ఈ స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ.. పాత చీర నాకు సున్నితంగా గుర్తుచేసినప్పుడు ఆమె ఉనికిలో ఉండి, నన్ను కౌగిలించుకుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.