కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రజలందరికీ వాక్సిన్ వేసే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం అదనంగా వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శెహనాజ్, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, ఫెరోజ్, వార్డు సభ్యుడు సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.