తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
బుధవారం మంత్రి హరీశ్‌రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు మందుల రాఘవారెడ్డి తల్లి నర్సవ్వ మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు.
ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆ కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఉమేశ్‌చంద్ర, ప్రజాప్రతినిధులు ఉన్నారు