తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు.
సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్ రూమ్స్, రూ. 27 లక్షతో సీసీ రోడ్డు, బృందావన్ కాలనీలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు, మల్లాపూర్‌లో శ్మశాన వాటికలో రూ. 12.50 లక్షలతో టాయిలెట్స్, నాదర్‌గుల్ 9వ డివిజన్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, నాదర్‌గుల్ రామాలయం దగ్గర సీసీ రోడ్డుకు రూ.13 లక్షలు, వెంకటాద్రి నిలయంలో రూ.20 లక్షలతో పైపులైన్ , సెవన్ హిల్స్ కాలనీ, వెంకటాద్రి నివాస్‌లో రూ.3 లక్షలతో డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆటోలు, ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతికి రూ. 175 కోట్లు, పల్లె ప్రగతికి రూ.308 కోట్లు కేటాయించారన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రతి నెల రూ.72 లక్షలు కేటాయిస్తున్నామన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ. 18 కోట్లు, బడంగ్‌పేటకు, రూ.4,50 కోట్లు, మీర్‌పేటకు రూ.4.50 కోట్లు, జల్‌పల్లికి రూ.4.50 కోట్లు, తుక్కుగూడకు రూ.4.50 కోట్లు ఇచ్చామని తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతిమొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దశలవారీగా గ్రామాలు, పట్ణణాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.