కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారు.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు..ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమే..
మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదు.ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా చేయలేదు… బర్త్ రఫ్ చేశారు.
మంత్రులకు స్వేచ్ఛ లేదంటున్న ఈటెల… ఆ విషయం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత గుర్తుకు వచ్చిందా?రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా ఉంది.హుజురాబాద్ లో సంక్షేమ పథకాలు అపుతామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోంది.ఐదేళ్లు కొట్లాడితే రాష్ట్రానికి హైకోర్టు వచ్చింది.ఈటెల రాజేందర్ మాటల్లో కొత్తేమి లేదు. పార్టీ మారిన వాళ్ళు మాట్లాడిన మాటలే ఈటెల మాట్లాడుతున్నారు అని అన్నారు…