నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు..ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నడిచి వెళ్లాను అని అన్నారు నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
తనకి అవమానం జరిగిందని మీడియా లో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు..
తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు,వారి భద్రత దృష్ట్యా పోలీసులకు,ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని దగ్గరే ఉన్నందున నడిచి వెల్లానని,తనకు ఎలాంటి అవమానం జరగలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు..