Home / SLIDER / ప్రొఫెసర్ జయశంకర్ కు మంత్రి పువ్వాడ నివాళులు

ప్రొఫెసర్ జయశంకర్ కు మంత్రి పువ్వాడ నివాళులు

తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఖమ్మం లో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, వారి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని మంత్రి అన్నారు.

ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాల తో అభివృద్ది లో తెలంగాణ పోటీ పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి అర్పిస్తున్నదని మంత్రి పువ్వాడ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat