తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది.
దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, ఏపీలో 5.23 కోట్లు అని జన గణన విభాగం తెలిపింది.