ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు..
కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.