ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్‌గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం.
2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.
2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని అందుకున్న థాంప్సన్.. ఇక నుంచీ స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు సంస్థ వెల్లడించింది. తాను దాతృత్వ కార్యకలాపాలపైనే దృష్టిసారించాలని అనుకుంటున్నట్లు చెబుతూ గతేడాది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.