తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీకి దమ్ముంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్‌ను ఎంత తిట్టినా ఎంత దూషించిన తమకు పోయేది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌ను తిడితే పెద్ద లీడర్లు కాలేరని కేటీఆర్ అన్నారు.