తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ఈనెల 21న శంకుస్థాపన చేయనున్నారు.అందులో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జిల్లాలోని గ్రామాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. వరంగల్ నుంచే జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలను మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయభాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి బుధవారం పరిశీలించారు.