దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి.
ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,81,903 మంది మరణించారు. మరో 8,26,740 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో 71 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు కనిష్టస్థాయికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 1,03,570 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని, మరో 2,330 మంది మృతిచెందారని వెల్లడించింది.