పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగ య్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భం గా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడు తూ.. రాష్ట్రం రాకముందు 30లక్షల ఎకరా ల్లో మాత్రమే వరి పండేదన్నారు. నేడు కోటి ఎకరాలు దాటిపోయిందంటే, కేవలం కేసీఆర్ సారథ్యంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులను బాగుచేయడం, రైతులకు పెట్టుబడి సాయం, బీమా అందించడం వల్లేనని వివరించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా, ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించకపోయినా రాష్ట్రం అద్భుత ప్రగతితో ముందుకు పోతున్నదని స్పష్టంచేశారు.