తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు లకు కృతజ్ఞతలు తెలిపారు.