తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహారి మాట్లాడుతూ”ఈటెల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?.ఈటెల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయి.రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటెల బీజేపీలో చేరారు.తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరాడు?.బీజేపీలో ఈటెల రాజేందర్ కు సముచిత గౌరవం దక్కేలా లేదు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతాడని అనుకున్నాం..కానీ అది జరగలేదు.రాచరికపు, ఫ్యూడల్ కు ఉండాలిసిన భావాలు, ఆస్తులు ఈటెల రాజేందర్ వద్ద ఉన్నాయి” అని ఫైర్ అయ్యారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించేవారు కావచ్చు కానీ బీజేపీ లో చేరడం తో ఆయన పైన నమ్మకం పోయింది.పోరాటం చేయకుండా పారిపోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు.బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.కులాల వారిగా, మాతలా వారిగా జాతిని విభజించే పార్టీ బీజేపీ.వెస్ట్ బెంగాల్ లాగా తెలంగాణ లో కుట్రలు చేస్తున్నారు.తృణమూల్ పార్టీలో చిచ్చు పెట్టె ప్రయత్నం చేసింది విఫలం అయ్యింది.అలాగే తెలంగాణలోను అస్థిరత్వం తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది.అందులో భాగంగా ఈటల ఎపిసోడ్ నడిపిస్తుంది.బీజేపీ కి వెస్ట్ బెంగాల్ లో లాగానే తెలంగాణలోను చెంప పెట్టు ఉండబోతుంది” అని అన్నారు.
తెలంగాణలో బీజేపీ కి క్యాడర్ లేదు.గ్రామ స్థాయి లో నిర్మాణం లేదు.తెలంగాణ ప్రజల ఆదరణ టిఆర్ఎస్ కె ఉంది.సీఎం కేసీఆర్ పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు.తెలంగాణ రాజకీయ ల్లో వేరే వారికి స్థానం లేదు.కాంగ్రెస్ తుడిచి పెట్టుకపోతోంది.బీజేపీకి ఆదరణ లేదు.తెలంగాణ రాజకీయాలను తట్టుకునే బహు బలి కేసీఆర్ మాత్రమే.తెలంగాణ కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష. కేసీఆర్ ని మాత్రనే బలపర్చాలి అని పిలుపునిచ్చారు..