Home / LIFE STYLE / బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story

బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story

మనిషి సంఘ జీవి . చీమలు, చెదలు, తేనెటీగలు లాంటి జీవులు కూడా పరస్పర చర్య కొనసాగిస్తూ సంఘాలుగా వ్యవస్తీకృతం అయివుంటాయి కానీ వాటి సంఘ జీవనానికి ఆలంబన సహాజిత ప్రవర్తన .

మానవ సమాజం దేహం అయితే అందులోని ప్రాణం సంస్కృతి . సంస్కృతి లేనిదే సమాజం లేదు . సమాజం లేకుండా సంస్కృతికి మనుగడ లేదు . సాంస్కృతి అనేది నేర్చుకొన్న లేదా అనుకరించే ప్రవర్తన .

1920 లో ఆనాటి బెంగాల్ లో జరిగిన ఒక ఘటన . ఒక గ్రామానికి చెందిన కమల విమల అనే ఇద్దరు కవల పిలల్లను { నెలల వయసులో } తోడేళ్ళు లాక్కుని అడవిలోకి వెళ్లిపోయాయి . వారిని తోడేళ్ళు చంపేసి వుంటాయని గ్రామస్థులు అనుకొన్నారు . కొనేళ్లకు అడవిలో ఇద్దరు బాలికలు కనిపించడం తో వారిని ఊరికి తెచ్చారు . కమల విమలను తోడేళ్ళు పెంచి పోషించాయి .

అనేక సంవత్సరాల తరువాత ఇంటికి వచ్చిన సోదరీలు అచ్చం తోడేళ్ళ లాగే ప్రవర్తించేవారు . పగలంతా నిద్ర . రాత్రి బయటకు వచ్చేవారు . తోడేళ్ళ లాగే నాలుగు కాళ్ళ పై నడవడం . తోడేళ్ళ అరుపులు . వాటి లాగే గిన్నెలో పెట్టిన పాలు నాకడం .

1980 దశకం లో టార్జాన్ ది ఏప్ మాన్ అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది . హేమంత్ బిర్జి హీరో గా హిందీ లో అదే సినిమా వచ్చింది . నెలల వయసులో అడవిలో తప్పిపోయి జంతువుల చేత పెంచబడ్డ మనిషి ఎలా ఉంటాడు అనేది ఇందులో చూపించారు .

భాష, నమ్మకాలు, కట్టు బాట్లు, విలువలు , ఆచారాలు , వ్యవహారాలు , ఏది మంచి ఏది చెడు, కళలు ఇలాంటి వాటినే సంస్కృతి అంటారు . ఇది మనిషికి సహజం గా రాదు . సమాజం లోని మిగతా వారిని చూసి నేర్చుకొంటారు . ఈ ప్రక్రియనే సామాజీకరణ అంటారు . ఇది జరగక పొతే వ్యక్తి సమాజం లో ఫిట్ కాలేడు.

బిడ్డ పుట్టిన ఆరునెలల నుంచి చుట్టూరా జరిగేది గమనించి వేగంగా నేర్చుకోవడం మొదలు పెడుతాడు . ఇంట్లో తల్లి తండ్రి మొదలైన వారు చంటి బిడ్డ కు భాష , ఏది చెయ్యాలి , ఏది చెయ్యకూడదు నేర్పుతారు . ఇలా ఇంట్లో జరిగే ప్రక్రియనే ప్రాధమిక సామాజీకరణ అంటారు .

ఒకప్పుడైతే వుమ్మడి కుటుంబాలు , కుల ఆధారిత వృత్తులు ఉండేవి . ఆధునిక కాలం లో ఇవి కనుమరుగయ్యాయి . బిడ్డ ప్రీ స్కూల్ లో అడుగుపెట్టినప్పుడు ద్వితీయ సామాజీకరణ మొదలవుతుంది .

మూడేళ్ళ దాకా ఇంట్లో . ఇంట్లోని వ్యక్తుల మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి . రక్త సంబంధం . అక్కడంతా సారూప్యత . అదే పాఠశాల లో భిన్నత్వం . అక్కడ వ్యక్తుల మధ్య వున్నవి ఇన్ఫార్మల్ సంబంధాలు .

మనం నివసించే సమాజం లో భిన్నత్వం కనిపిస్తుంది . నేడు ప్రపంచీకరణ వల్ల భూగోళం కుగ్రామం అయ్యింది . వ్యక్తి తన జీవిత కాలం లో విభిన్న సమాజాల్లోకి వెళ్లి , భిన్న సంస్కృతులు గల వ్యక్తుల తో వ్యవహరించాల్సి ఉంటుంది . దీనికి శిక్షణ, పునాది మూడో ఏటే ప్రీ ప్రైమరీ స్కూల్ లో పడుతుంది . విద్యార్ధి దశ మొత్తం కొనసాగుతుంది .

మహేష్ బాబు హీరో విషయం తీసుకొందాము. ఆయన సంపాదన కోట్లలో ఉంటుంది . తనకు ఇద్దరు పిలల్లు . ఒక్కో బిడ్డ కు పదకొండు మంది టీచర్ లను నియమిస్తే వారి జీతం నెలకు పదకొండు లక్షలు . ఇలా తన సంవత్సర ఆదాయం తో ఇద్దరు పిలల్లకు ఇంటిలోనే ఒకటో తరగతి నుంచి స్కూల్ ఫైనల్ దాక విద్య నందించవచ్చు . కానీ ఆయన అలా చేయలేదు . పిలల్లను స్కూల్ కు పంపుతాడు . ఆయనే కాదు . ఎంత కోటీశ్వరులైనా పిల్లల్ని ఇంటివద్దే ఉంచి చదివించాలని అనుకోరు . పాఠశాలకు పంపుతారు . ఎందుకు ? ఆలోచించారా ?

పద్మిని కొల్హాపురే, తరుణ్ , శ్రీదేవి .. ఇలా పదుల సంఖ్యలో బాలనటీనటుల పేర్లు చెప్పుకోవచ్చు . చిన్న వయసులోనే వీరు అద్భుత ప్రతిభ పాటవాలు ప్రదర్శించి మన్ననలు అందుకొన్నారు . కానీ నిజ జీవితం లో పెద్దగా రాణించ లేక పోయారు . కారణం ఆలోచించారా ?

పిల్లలు పాఠశాలలో నేర్చుకునేది కేవలం పాఠ్య పుస్తకాల్లోని అంశాలే కాదు . టీచర్ లు చెప్పేది విని పిలల్లు నేర్చుకునేది వారి కాగ్నిటివ్ నాలెడ్జి లో కొంత భాగమే . పరిసరాలు , క్లాస్ రూమ్ లోని తమ క్లాస్ మేట్స్ , టీచర్ , అక్కడున్న వాతావరణం .. వీటిని చూసి ఎన్నో గ్రహిస్తారు . ఇదే వారి మైక్రో యూనివర్స్ .. మినీ ప్రపంచము . జీవితమనే రంగస్థల ప్రదర్శన కు రిహార్సల్స్ జరిగేది ఇక్కడే . . ఆలా జరగకపోతే వారు అర్ధ తార్జాన్ లుగా మిగిలిపోతారు .

వైవిధ్యత ను అంగీకరించడం , ఇవ్వడం , పుచ్చుకోవడం , పంచుకోవడం , స్నేహం , అసూయ, ద్వేషం , ఘర్షణ , రాజీ , స్నేహం , వైరం , మంచి చెడు , లిఖిత నియమాలు , అలిఖిత నియమాలు .. ఇలా సాగిపోతుంది బాల్యం లో నేర్చుకొనే ప్రక్రియ .

ఇంట్లో తానూ ఒక్కడే . లేదా ఇద్దరు . ముద్దు మురిపెం . పాఠశాల ఆలా కాదు . తాను అందరిలో ఒక్కడు . అందరితో కలిసి వ్యవహరించాలి . ప్రతి సమూహానికి కొన్ని నియమాలు ఉంటాయి . వాటిని పాటించాలి . క్లాస్ లో బయటకు వెళ్ళాలి అంటే టీచర్ పర్మిషన్ తీసుకోవాలి . టాయిలెట్ కు వెళాళ్లి అంటే వేలు చూపించి అడగాలి . పక్కన ఉన్న విద్యార్ధి పెన్సిల్ తీసుకోవాలంటే తనను అడగాలి . తీసుకొన్నదాన్ని ఇచ్చి వేయాలి . సహాయం .. అప్పు .. ఇచ్చి పుచ్చుకోవడం .. కృతజ్ఞత, సానుభూతి , సహానుభూతి , ఆత్మ విశ్వాసం , నాయకత్వ లక్షణాలు , క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , సమాజం పటేల్ అవగాహన , సమిష్టి తత్త్వం , ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంటర్ పర్సనల్ స్కిల్ల కు ప్రయోగ శాల తరగతి గది.ఇది నేర్వని చదువు రసం తీసిన చెరుకు పిప్పి .

ఇలాంటి పాటలను టీచర్ లు చెప్పక పోయినా మానేజ్మెంట్ లో ప్రోత్త్సహించక పోయినా పిలల్లు సహజంగా తోటి పిల్లల తో కలిసి వ్యవహరించడం వల్ల నేర్చేసుకొంటారు . ఒక్క సారి మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి . టీచర్ నేర్పని పాటలెన్ని గ్రహించి వుంటారు ?

గ్రామాల్లో అయితే పరిస్థితి కాస్త మెరుగు . పట్టణాల్లో, అపార్ట్మెంట్ ల లో ఉన్న పిల్లల పై ఒక సారి ద్రుష్టి సారించండి . వారి బతుకులు పంజరం లో చిలకలు . కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యింది . ఇప్పుడు యూకేజీ కి వచ్చిన పిల్లల వయసు ఐదేళ్లు . వారింకా బయట ప్రపంచం చూడలేదు . వారి ద్వితీయ సామాజీకరణ ఇంకా మొదలు కాలేదు. గతం లో క్లాసులు ఒకరో ఇద్దరో delayed మైల్ స్టోన్స్ పిల్లలు ఉండేవారు . ఇప్పుడు క్లాసు మొత్తం అలాంటి పిల్లలే . టార్జాన్ సినిమా లో హీరో లకు బెంగాలీ తోడేలు బాలికలకు వీరికి తేడా ఉన్న మాట వాస్తవం . కారణం వీరి ప్రాథమిక సామాజీకరణ మొదలయ్యింది . కానీ ద్వితీయ సామాజీకరణ ? అది అనేక నెలల ఆలస్యం .

ఆ ఏముంది ..15 నెలలే కదా. తరువాత నేర్చుకొంటారు లే అని చాల మంది అనుకొంటారు .

౦ -10 సంవత్సరాల వయసులో బిడ్డలా గ్రహణ శక్తి గరిష్టంగా ఉంటుంది . జీవితానికి కావాల్సిన మెలకువలో 50 శాతం నేర్చుకునేది ఈ దశలోనే . అటు పై 10 -20 వయసులో మిగతా 45 శాతం . ఇక పై జీవితాంతం నేర్చుకునేది మరో అయిదు శాతం మాత్రమే . ఇక్కడ నేర్చుకునేది అంటే పాఠ్యపుస్తకాల్లో ని అంశాలు అనుకొంటే మీకు అసలు విషయం అర్థం కాలేదని చెబితే హర్ట్ కాకండి .

వ్యక్తి వ్యక్తిత్వానికి పునాది పడేది ఇరవై ఏళ్ళ లోపే . అంత కంటే కచ్చితంగా చెప్పాలి అంటే పదేళ్ల లోపే .

ఈ విషయాన్ని గ్రహించారు గనుకే ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో బడులను ఏ దశలోనూ మూయ లేదు . పిల్లల పై కరోనా ప్రభావం తక్కువ . పిల్లల సామాజీకరణ కుంటుపడకూడదు . కాబట్టి బడులు తెరిచే ఉంచాలి . ఇది వారి అవగాహహన .

ఇక్కడ ? పదహైదు నెలలుగా బాల్యం బందీ . చదువంటే పరీక్షలు . పాఠ్య పుస్తకం లో ని పాఠాలు. పరీక్షలు రద్దు చేసి లేదా ఆటోమేటిక్ గా పై తరగతులకు ప్రమోట్ చేస్తే పని అయిపోతుంది అని అవగాహహన .

విద్య వ్యాపారీకరణ , విదేశీ మార్కెట్ లో కూడగట్టిన మిలియన్ డాలర్ ల సొమ్ము తమకు నజరానా ల రూపం లో వస్తుంటే సంతోషించే శక్తులు , తల్లితండ్రుల అవగాహనా లేమి …. ఒక్కటేమిటి ? అసలు సమస్య పై చర్చ లేదు . ఇది ఒక సమస్యే కాదు అనుకొనే వారు ఎంతో మంది . అయ్యా ఇలా ఆలోచించండి అంటే వీడేదో తన ప్రయోజనాల కోసమే ఈ అట అంటున్నాడు అనుకొనే పరిస్థితి . ఇదొక చారిత్రక తప్పిదం . నేరం . ఘోరం . తీరుబడిగా పసశ్చాత్తాప పడే రోజులు వస్తాయి . వేచి చూడండి . అప్పటిదాకా స్టే హోమ్ . అది మీకు మీ కుటుంబానికి ఎంత మాత్రం సేఫ్ కాదు .

కనీసం పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్లి ఆడించండి . అపార్ట్మెంట్ ల లో తోటి పిల్లలతో ఆడుకోనివ్వండి . అయిదేళ్ల లోపు పిలల్లకు మాస్క్ లు అవసరం లేదు .

బాల్యాన్ని రక్షించండి ..అదే మీకు మన సమాజానికి రక్షణ .

బాల్యో రక్షతి రక్షితః !

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat