దేశం అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.