అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
