దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది.
మరో వైపు 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్ బారినపడి మరో 2,726 మంది మరణించారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు 3,77,031 మంది వైరస్ సోకి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,13,378 ఉన్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 25,90,44,072 డోసులు వేసినట్లు వివరించింది. ప్రసుతం దేశంలో రికవరీ రేటు 95.64శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువకు పడిపోయిందని.. 4.39శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది.