నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.31 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదని అన్నారు.ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది పేద ప్రజలకు వారి ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా రూ. లక్ష నుంచి మొదలుకొని రూ. 10 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తున్నామన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రజలకు సీఎం సహాయనిధి అంటే తెలవకుండా చేశారు. జబ్బు చేస్తే పేద వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదన్నారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారని ప్రశంసించారు