తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
సియం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.