కరోనాతో తండ్రి మరణించగా, ఓ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకోవాలంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ముగ్గురి పిల్లల పట్ల ప్రత్యేక చొరవ చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులపూర్ గ్రామానికి చెందిన భూసి సత్తయ్య గత 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.
సత్తయ్యకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ జూన్ 4 వ తేదీన మృతి చెందాడు. దీంతో సత్తయ్య ముగ్గురు పిల్లలు నిరాశ్రయులయ్యారు. వారి ధీనస్థితిని అర్థం చేసుకున్న నల్లల సాయికిరణ్ అనే యువకుడు కేటీఆర్ కు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ ముగ్గురు పిల్లలను తక్షణమే ఆదుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జిల్లా కలెక్టర్ గుగులోత్ రవికి సూచించారు.