తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు.
లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు , CS సోమేశ్ గారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది.
ఆర్టీఏ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆయా వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ప్రగతి భవన్ లో ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో కలిసి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. వారి వెంట ట్రాన్స్పోర్ట్ కమీషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.