తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది.
సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను అందజేశారు.