సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు.
ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో ‘శీనయ్య’ అనే ప్రాజెక్ట్ మొదలై ఆగిపోయింది.
ఇప్పుడు ‘ఏకే’ రీమేక్‌లో మరోసారి స్క్రీన్ మీద కనిపించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన మేకర్స్ నుంచి రావాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.