తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థ విక్రయాలను పూర్తిగా అరికట్టెందుకు రాజకీయాలకు అతీతంగ కలిసి రావలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు.తిరుపతి నగరంలో బుధవారం సాయంత్రం భూమన పలు ప్రాంతాల్లో తన సిబ్బందిని,వాహనాలను ప్రక్కన పెట్టేసి కాలి నడకన తిరుగుతూ పరిస్థులను పరిశీలించారు.
గత కొన్ని రోజుల ముందు ఎమ్మెల్యే భూమన సైకిల్ పై పర్యటిస్తూ మత్తు పదార్థాలకు లోనైన యువకుల పరిస్థితిని చలించిపోయి, తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థాలను అరికట్టండి అని స్వయంగ రాసిన పిర్యాదును తిరుపతి అర్భన్ ఎస్.పి. ని కలిసి ఇవ్వడం జరిగింది.
బుధవారం భూమన కాలి నడకన తిరుగుతూ పర్యటించారు.ఈ సంధర్భంగ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ పుణ్యక్షేత్రంలో ఈ మత్తు విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, భవిషత్తును నాశనం చేసుకుంట్టున్న యువతను రక్షించుకుందామని పిలుపునిచ్చారు.పోలీసుల స్పందన భాగుందని,ఇదే సమయంలో ప్రజల్లో కదలిక రావాలని విజ్ఞప్తి చేసారు.
నగరంలోని యాచకులను,అనాధలను ఈ మత్తు పదార్థాల విక్రయానికి వాడుకుంట్టున్న విక్రేతలను వదిలిపెట్టె ప్రసక్తేలేదన్నారు.కొంతమంది యువత ఈ మత్తుకు బానిస అవ్వడమే కాకుండ విక్రయాలు కూడా సాగించడం ఆందోళన కల్గించే అంశమని భూమన ఆవేదన వ్యక్తం చేసారు.ఈ మత్తును తుదముట్టించేందుకు అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టిలు కలిసికట్టుగా పోరాడదామని భూమన ఆకాంక్షించారు.