ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు.
ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు.
ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడారు.కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిలషించారు.