తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య రంగంలో అవసరమైన పలు పరీక్షల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు బుధవారం నాడు డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అత్యధునాతన డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు తో పాటుగా మరికొన్ని ఖరీదైన పరీక్షలు కూడా చేయడం జరుగుతుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
అలానే అక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్రై సైకిల్స్ ను వికలాంగులకు అందించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు గారు కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు మరియు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు ,రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.