తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.