ప్రజారోగ్య పరిరక్షణ లో తెలంగాణా ప్రభుత్వం సత్ఫాలితలు సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే అందుకు కారణమని ఆయన చెప్పారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మెడీకల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం రోజున ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ముందు చూపు నిర్ణయాలు సత్ఫాలితలు యిస్తున్నాయాన్నారు.
మెడికల్ కళాశాలల ఏర్పాటు తో ఓనగూరే ప్రయోజనం ఎంత అన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఇప్పుడిప్పుడే బోధ పడుతుందని ఆయన చెప్పారు.యింకా ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రాజన్నగూడెం సింగిల్ విండో చైర్మన్, సీనియర్ టి ఆర్ యస్ నేత కే. వి రామారావు,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.