Home / SLIDER / తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..

కేబినెట్ కీలక నిర్ణయాలు …..

రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది

కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

రేషన్ డీలర్ల కమీషన్, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీ గంగుల కమలాకర్ అధ్యక్షతన సబ్ కమిటీని కేబినెట్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

చేపలు, గొర్రెల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ సంసిద్ధత మీద కేబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది.

ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది.

హైదరాబాద్ మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టి.ఎస్.ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు కేబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.

రైతుల కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా వుండే హద్దురాల్లు, కాగితాల మీద వుండే టీఫన్ నక్షతో కూడిన కొలతలు ఇక నుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని, రాల్లు ఊడిపోయినా కొలతల కాగితాలు చినిగిపోయినా పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుంది.

వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని, ఇప్పటికే సమస్యలేవి లేకుండా పరిష్కారమైన ప్రక్రియ అని, ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్ చట్టం-2020 ప్రకారం 99శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదయ్యాయని కేబినెట్ కు రెవిన్యూశాఖ వివరించింది.

ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ వైద్య ఆరోగ్య కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.

వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ (9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat