Home / SLIDER / డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యత-మంత్రి జగదీష్

డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యత-మంత్రి జగదీష్

డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా యావత్ రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవొచ్చని ఆయన పేర్కొన్నారు. వానాకాలం పంటలపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్,వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ వానాకాలం లో జిల్లా లో 12 లక్షల 18 వేల 710 ఎకరాలు సాగులోకి రానున్నట్లు గుర్తించినట్లుఅధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.2020 వానాకాలం తో పోల్చి చూసినట్లయితే 63,730 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

అందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక వివరాలు వారు మంత్రి జగదీష్ రెడ్డి కి అందించారు. కింద టెడాది తో పోల్చుకుంటే ఈ వానాకాలంలో వరిని తగ్గించే విదంగా వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.2020లో జిల్లాలో 401124 ఏకరాలలో వరి పండించగా ఈ వానాకాలం నాటికి దానిని 353800 ఎకరాలకు కుదించారు.అంటే మొత్తం మీద 47 వేల 324 ఎకరాలను తగ్గించారు.దీనిని గమనించిన మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికి అధికారులు చొరవ చూపాలని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో పత్తి,కందులకు మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. జొన్నలు, పెసర్లు, మినుములు,పొద్దు తిరుగుడు తో పాటు ఆముదం,మొక్కజొన్న తదితర పంటలకున్న డిమాండ్ ను రైతులకు వివరించ గలిగితే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు దృష్టి మరల్తుందని ఆయన చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat