తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని జాజిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన అంజయ్య గతేడాది ఫిబ్రవరిలో పదోన్నతిపై సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1995లో గ్రూప్-2కు ఎంపికై మొదట ఉప తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.