Home / MOVIES / పెళ్లైన కానీ తగ్గని హాట్ బ్యూటీ

పెళ్లైన కానీ తగ్గని హాట్ బ్యూటీ

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్‌ అగర్వాల్‌. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది.

ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది.

హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించినట్లు చెబుతున్నారు. ఆ సన్నివేశాల్లో అజయ్‌దేవ్‌గణ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat