విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు..బల్దియా పరిధి 41 వ డివిజన్ శంభునిపేట గవిచర్ల క్రాస్ రోడ్,చైతన్యనగర్,ఉర్సు కరీమాబాద్,షానూర్ పుర ప్రాంతాల్లో మేయర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సానిటేషన్ స్థితి గతులను పరిశీలించారు.
ఈ సందర్భం గా గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సానిటేషన్ ను పకడ్బందిగా చేపట్టాల్సిన అవసరం ఉందని,ఉదయం 10 గం.ల తర్వాత గ్యాంగ్ వర్క్స్ నిర్వహించాలని ఎస్.ఐ. ని ఆదేశించారు.
స్విపింగ్ మిషన్స్ తో శుభ్రం చేయించే క్రమంలో స్థానిక కార్పొరేటర్స్ కు సమాచారం ఇవ్వాలని, వీటి నిర్వహణకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని,డివిజన్ లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది విధులను జవాన్లు,ఎస్.ఐ. లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఉర్సు షానూర్ పుర, హరి మిల్క్ పాయింట్ సమీపంలో రోడ్డు పైన మురికినీరు ప్రహహిస్తుండడం తో అక్కడ కల్వర్టు నిర్మాణం చేపట్టేలా చూడాలని అన్నారు.డ్రైనేజీ లలో చెత్త వేయకుండా ప్రజలలో చైతన్యం కలిగించాలని మేయర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి,ఎస్.ఐ. లు సునీల్,నాగభూషణం,జవాన్ అనిల్ స్థానికులు రమేష్,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.