చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన పెళ్లి చూపులతో హీరోయిన్గా ఆకట్టుకున్న హీరోయిన్ రీతూ వర్మ… ఆ తర్వాత కొలీవుడ్లో వరస చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె తెలుగులో యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్, వరుడు కావలెను’ మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కుటుంబ కథా చిత్రాలే.
అయితే తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని రీతూ ఈ సందర్భంగా తెలిపింది. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాల్లో నటించడమే తనకు ఇష్టమని తేల్చి చెప్పింది.