తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 14 మంది చనిపోయారు.
రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 మందికి పాజిటివ్‌గా తేలింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే 100కు పైగా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,614 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,016 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 94.85 శాతానికి చేరింది.