రష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. కన్నడలో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు తమిళం, హిందీలో తన హవా చూపించే ప్రయత్నంలో ఉంది.
ఇప్పటికే కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ భామ సొంతం.
రష్మిక అభిమానులు ఆమెను ‘నేషనల్ క్రష్’ గా అభివర్ణిస్తుంటారు. ఇటీవల పింక్ టాప్, వైట్ స్వెట్ ప్యాంట్స్ తో ట్రెండీ గ్లాసెస్ పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో నుంచి తీసిన స్క్రీన్ షాట్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటోల్లో సూపర్ క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తూ. నేషనల్ క్రష్ గా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది.