Home / SLIDER / అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం

అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్:

– వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


– వ్యాక్సినేషన్ ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కొ నివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం.

– రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్ లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదు.
కంపెనీ లు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వ్వడం లేదు

– తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వన్ వ్యవహరిస్తుంది.

– కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ…
రాష్ట్రాల ను బద్నాం చేసేలా కేంద్ర వ్యవహారం

– వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీ లో కేంద్ర ఫెయిల్యూర్

– వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను పున సమీక్షించుకోవాలి.

 

– వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలి

– రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలి

– రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను కంపెనీలు ,ఇతర దేశాల నుండి దిగుమతి చేసే చేసుకునే అవకాశం ఇవ్వాలి.

-కోవా గ్జిన్, కొ విషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ 100 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చింది.

– రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయి.

– తెలంగాణలో హై రిస్క్ స్కూల్ గ్రూపులకు, ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం.

– 13 నగర పాలక సంస్థలు, 129 మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయలు, పండ్లు విక్రేతలు, మద్యం విక్రేతలు, హోటల్ లో పనిచేసే వ్యక్తులు, స్మశాన వాటిక లో పనిచేసే వ్యక్తులు, కిరాణా షాపులో పనిచేసే వ్యక్తులు మొదలైన 8 లక్షల 50 వేల మందికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్.

– నేటి నుంచి 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం

– ప్రాధాన్యత క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రజలతో అనునిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు వ్యాక్సినేషన్.

-తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటుంది

– ఇప్పటికే కరోనా కట్టడికి నిర్వహించిన ఇంటింట సర్వే మంచి ఫలితాలను ఇచ్చింది

– మూడో మేము కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉంది

– ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చర్యలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat