ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బీజేపీలో చేరే ముందు ఒకసారి ప్రశ్నించాలని ఈటలకు పల్లా సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు.
ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందేనన్నారు. కరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేశారంటూ ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా అని ప్రశ్నించారు.