తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు.
వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు.
నిండు కుండలా కళకళలాడుతూ మత్తడి దుకుతున్న దృశ్యాన్ని చూసి నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇక అన్ని కాలాల్లో సంవృద్దిగా నీరు నిల్వ ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.